Actor Nithiin: పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తే నితిన్ రిప్లయ్ ఇదే!

- ఈ నెల 28న నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా విడుదల
- విజయవాడలో సందడి చేసిన చిత్ర బృందం
- పొలిటికల్ ఎంట్రీపై సమాధానమిచ్చిన నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంలో హీరో నితిన్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా..
పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన లేదు, సినిమాల్లో హాపీగా ఉన్నానని నితిన్ స్పష్టం చేశారు. ఇటు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి పలువురు సినీనటులు రాజకీయాల్లోనూ రాణిస్తున్న నేపథ్యంలో నితిన్‌ను ఓ మీడియా ప్రశ్నించగా, దానిపై స్పందించారు. సినిమాల్లో హాపీగా ఉన్నానని వెల్లడించారు. పొలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని తెలియజేశారు.