BRS Leaders: జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన .. బీఆర్ఎస్ నేతల అరెస్టు

- జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన బీఆర్ఎస్
- బీఆర్ఎస్ నేతల అరెస్టుతో జిల్లాలో హైటెన్షన్
- మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్టు
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ది పనుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
అయితే రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.