Donald Trump: బాలుడిని హెలికాఫ్టర్ ఎక్కించిన ట్రంప్..ట్రెండింగ్‌లో చిన్నారి మస్క్

donald trump photo with elon musk son goes viral
  • మస్క్ కుమారుడిని హెలికాఫ్టర్ ఎక్కించిన ట్రంప్ 
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ 
  • హ్యాపీ పిక్చర్ అంటూ స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నాలుగేళ్ల కుమారుడు A -X12 సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఆ బుడతడు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ మైదానంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్న దృశ్యాలు, ట్రంప్ అతన్ని హెలికాఫ్టర్ ఎక్కిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ట్రంప్ వారాంతం నిమిత్తం ప్లోరిడాలోని తన నివాసానికి బయలుదేరిన సమయంలో మస్క్ కూడా వెళ్లారు. ఈ సందర్భంలో ట్రంప్ హెలికాఫ్టర్ ఎక్కేందుకు వెళ్తుండగా, ఆయన వెనకే మస్క్ కుమారుడు కూడా నడుస్తూ వచ్చాడు. హెలికాఫ్టర్ మెట్లు ఎక్కేందుకు బుడతడు ఇబ్బంది పడుతుండగా, స్వయంగా ట్రంప్ అతడిని లోపలికి ఎక్కించాడు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎలాన్ మస్క్ స్పందించారు. హ్యాపీ పిక్చర్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. Drandpa Trump అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 
Donald Trump
Elon Musk
Musk Son Photos
Social Media

More Telugu News