Chandrababu: వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం... పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

- టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం
- సతీసమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికిన అర్చకులు
ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ పాలకమండలి సభ్యులు తదితరులు హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు శ్రీనివాస కల్యాణోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం చంద్రబాబుకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందించారు. కాగా, ఈ వేడుకను తిలకించేందుకు రాజధాని పరిసర గ్రామాల నుంచి 30 వేల మంది వరకు భక్తులు వచ్చారు. వారికి టీటీడీ లడ్డూ ప్రసాదం అందించింది.






