Nara Lokesh: వైసీపీ మూకల దాడిలో మరణించిన రామకృష్ణకు కన్నీటి నివాళులు: నారా లోకేశ్

Nara Lokesh pays tributes to murdered TDP worker

  • చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త మృతి
  • జగన్ పై లోకేశ్ ఫైర్
  • జనం ఛీ కొట్టినా హత్యా రాజకీయాలు మానడం లేదన్న నారా లోకేశ్ 

చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త మృతి చెందడం పట్ల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో గాయ‌ప‌డి మృతి చెందిన‌ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన‌ టీడీపీ కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నానంటూ లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దాడిలో రామ‌కృష్ణ కొడుకు సురేష్‌ గాయపడ్డాడని, అతడికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశానని వెల్లడించారు. 

"శవం ద‌గ్గ‌ర పుట్టి, మ‌రో మృత‌దేహంతో అధికారంలోకొచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌నం ఛీకొట్టారు. అయినా హ‌త్యారాజ‌కీయాలు మాన‌డంలేదు. నిందితులను చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తాం. వైసీపీ ర‌క్త‌చ‌రిత్ర‌కు టీడీపీ సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాక‌రం. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News