Chandrababu: పవన్ కల్యాణ్ కు, జనసైనికులకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

- నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం
- పిఠాపురం నియోజకవర్గంలో భారీ సభ
- సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు
జనసేన పార్టీ నేడు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో 'జయకేతనం' సభ జరగనుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు, ఆ పార్టీ శ్రేణులకు విషెస్ తెలిపారు.
జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు, ముఖ్య నేతలకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు తాను, పవన్ కల్యాణ్ కలిసి అభివాదం చేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు.