KA Paul: నా తమ్ముడు ఏ రోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు: పవన్ పై కేఏ పాల్ సెటైర్లు

KA Paul satires on Pawan Kalyan

  • పవన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడన్న పాల్
  • చర్చిలపై జీవోను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
  • మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు.

ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అవకాశవాదిగా వ్యవహరిస్తున్నారని, ఆయన సిద్ధాంతాలు మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ఒకవైపు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నానని చెబుతూనే, మరోవైపు చర్చిలో బాప్తిస్మం తీసుకున్నానని చెప్పడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని పాల్ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి వేషాలు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

"పవన్ కల్యాణ్ పుట్టుక నుంచి సనాతన వాది కదా! పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అన్నాడు. మరి సనాతన వాది బీఫ్ తింటాడా... ముస్లిం వేషం వేస్తాడా...? జోర్డాన్ లో చర్చికి వెళ్లి నేను బాప్తిస్మం పొందాను అన్నాడు... నువ్వు పుట్టుకతోనే సనాతన వాదివి అయితే బాప్తిస్మం ఎలా తీసుకుంటావా? నా తమ్ముడు (పవన్ కల్యాణ్) ఎప్పుడూ సెక్యులరే...  ఏ రోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు. రాజకీయ పవర్ కొరకు బయటకు వచ్చేస్తాడు. బాగుపడాలంటే దేవుడు ఉన్నాడు... మోదీ కాపాడలేడు నిన్ను. 

గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పోలేదు... అంబేద్కర్ మంత్రి పదవిని కాళ్ళతో తన్నాడు కానీ అమ్ముడు పోలా... ఎన్టీ రామారావు  అధికారం పోయిన తర్వాత మనోవేదనతో ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పోలా. వాళ్ళ కాలి గోరు తీయడానికి మీరందరూ పనికొస్తారా? సెక్యులరిజమే నడుస్తుంది... కమ్యూనలిజం నడదు... దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండె ఆగి నిమిషంలో పోతావ్! హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి... ప్రపంచ శాంతి దూత అయిన ఈ కేఏ పాల్ ను చూసి నేర్చుకోండి" అంటూ పాల్ వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాకుండా, అనుమతి లేని చర్చిలపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10న జీవో జారీ చేశారంటూ కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు చట్టాలపై అవగాహన లేదని, మత స్వేచ్ఛను ఆయన ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్ గా తీసుకోవద్దని, ఆయన మాటలకు విలువ లేదని అన్నారు.

ప్రపంచ శాంతి కోసం తాను చేసిన కృషిని పాల్ గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను గతంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. ప్రస్తుతం తాను దేశంలో ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు కొనసాగించలేకపోతున్నానని ఆయన అన్నారు. తన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పాల్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News