Holi Wishes: గూగుల్, యాపిల్ సీఈఓల హోలీ శుభాకాంక్షలు

- భారత్‌లో ఘనంగా హోలీ సంబరాలు
- సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపిన సుందర్ పిచాయ్, టిమ్‌కుక్
- గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో తీసిన ఫొటోలను షేర్ చేసిన గూగుల్ బాస్
- ఐఫోన్‌లో తీసిన ఓ అమ్మాయి ఫొటోను పంచుకున్న యాపిల్ సీఈఓ
భారత్‌లో ఘనంగా జరుపుకునే హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ టెక్ సంస్థలు గూగుల్, యాపిల్ సీఈఓలు సుందర్ పిచాయ్, టిమ్‌కుక్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. ఇండియాలో హోలీ వేడుకలకు సంబంధించి గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో తీసిన ఫొటోలను సుందర్ పిచాయ్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే టిమ్‌కుక్ ఐఫోన్‌లో తీసిన ఓ అమ్మాయి ఫొటోను పంచుకున్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఆ అమ్మాయి పేరు కుశాగ్రా తివారీ. టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఎగ్జిఫ్ మీడియా సీఈఓనే కుశాగ్రా. "హోలీ పండుగ చేసుకుంటున్నవారందరికీ శుభాకాంక్షలు" అంటూ టిమ్‌కుక్ కుశాగ్రా తివారీ ఫొటోను షేర్ చేశారు. ఈ ఇద్దరూ దిగ్గజాలు పెట్టిన పోస్టులపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.