XXX Soaps: ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత మాణిక్యవేల్ కన్నుమూత

XXX Soaps chairman Manickavel Arunachalam passed away

  • 1980లలో తమిళనాడు నుంచి గుంటూరుకు వచ్చి స్థిరపడిన మాణిక్యవేల్
  • తయారుచేసిన సబ్బులు రిక్షాలో పెట్టుకుని విక్రయం
  • ఆ తర్వాత ఫ్యాక్టరీ స్థాపన

గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

తమిళనాడుకు చెందిన మాణిక్యవేల్ 1980లలో గుంటూరుకు వచ్చి సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. తొలుత తాను తయారుచేసిన డిటర్జెంట్ సబ్సులను రిక్షాలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి విక్రయించేవారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ స్థాపించారు. పాప్యులర్ సినిమా పాటల పల్లవులను తన సబ్బుల ప్రచారానికి వాడుకున్నారు. ‘ట్రిపుల్ ఎక్స్.. సంస్కారవంతమైన సోప్’ అనే ప్రకటన ప్రజాదరణ పొందింది. ఆర్థికంగా ఎదిగిన మాణిక్యవేల్ గుంటూరులోని పలు సాంస్కృతిక సంఘాలు, సేవా సంస్థలు, తమిళ సంఘాలకు చేయూత అందించారు. కాగా, నేడు గుంటూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News