Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Prices hike today

  • రూ. 600 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర
  • ఇరవై రోజుల తర్వాత మళ్లీ రూ. 89,450కి చేరిన బంగారం ధర
  • వెండి కిలో ధర రూ.1,000 పెరుగుదల

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.600 పెరిగి రూ.89,450 పలికింది. గత నెల 20వ తేదీన ఇదే స్థాయిలో ఉన్న పసిడి ధర ఈ రోజు మళ్లీ అదే స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగిన కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి సుమారు రూ.1,000 పెరిగింది. గత సెషన్‌లో రూ. 1,00,200గా ఉన్న వెండి ధర ఈరోజు రూ. 1,01,200కి చేరుకుంది.

అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 2,946 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో అంచనాలకు మించి ద్రవ్యోల్భణం నమోదయింది. దీంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ఈ కారణంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News