Malreddy Ranga Reddy: మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి చేతిలో లేదు.. ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలి: మల్‌రెడ్డి రంగారెడ్డి

- మంత్రి పదవులు నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదన్న రంగారెడ్డి
- తనకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి ఉన్నా ఇవ్వలేకపోతున్నాడని వ్యాఖ్య
- విజయశాంతి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆరోపణ
తనకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ ఆయన చేతిలో ఏమీ లేదని, ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదని, పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఉందని, కానీ ఇవ్వలేకపోతున్నాడని అన్నారు. విజయశాంతి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్నారని ఆరోపించారు.
సుమారు రెండు వారాల క్రితం కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది తాను ఒక్కడినేనని, కాబట్టి తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలలో వేరే పార్టీ వాళ్లను నేనే గెలిపిస్తానని వ్యాఖ్యానించారు.