BCCI: ఇంగ్లాండ్ క్రికెటర్‌కు బీసీసీఐ షాక్.. ఐపీఎల్ నుండి రెండేళ్ల పాటు నిషేధం

- హ్యారీ బ్రూక్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం
- ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించిన బీసీసీఐ
- కొత్త నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ క్రికెటర్‌పై చర్యలు
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను ఐపీఎల్ నుండి రెండేళ్ల పాటు నిషేధించింది. ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌లు ఆడటానికి అతను రాలేదు. దీంతో బ్రూక్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఇందుకు సంబంధించి బీసీసీఐ సమాచారాన్ని అందించిందని తెలుస్తోంది.
బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం, వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుండి వైదొలిగితే రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు.
ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ ఇంగ్లాండ్ బ్యాటర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది తన అమ్మమ్మ మృతి చెందడంతో కుటుంబంతో ఉండటానికి ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.