Indian Cricketers: సొంతంగా రెస్టారెంట్ బిజినెస్ కలిగిన భారత క్రికెటర్లు వీరే..!

- ఆరుగురు టీమిండియా ఆటగాళ్లకు రెస్టారెంట్ బిజినెస్
- కోహ్లీకి 'వన్8 కమ్యూన్', కపిల్ దేవ్‌కు చండీగఢ్‌లో 'ఎలెవన్స్'
- ధావన్‌కు దుబాయ్‌లో 'ది ఫ్లైయింగ్ క్యాచ్' పేరిట స్పోర్ట్స్ కేఫ్, రెస్టారెంట్
- రవీంద్ర జడేజాకు 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' పేరుతో రాజ్‌కోట్‌లో రెస్టారెంట్
- రైనాకు నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్ బిజినెస్
టీమిండియా తరఫున ఆడిన కొందరు భారత క్రికెటర్లకు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్‌లు ఉన్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా రెస్టారెంట్ బిజినెస్ కలిగిన ఆరుగురు టీమిండియా ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి దేశంలోని ప్రధాన నగరాల్లో 'వన్8 కమ్యూన్' పేరిట రెస్టారెంట్ అండ్ బార్ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని రకాల వంటకాలు ఈ రెస్టారెంట్‌లో దొరుకుతాయి.
- భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ థీమ్‌తో చండీగఢ్‌లో 'ఎలెవన్స్' పేరుతో రెస్టారెంట్ నడిపిస్తున్నారు. నార్త్ ఇండియన్ రుచికరమైన వంటకాలు ఈ రెస్టారెంట్ స్పెషల్.
- టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు దుబాయ్‌లో 'ది ఫ్లైయింగ్ క్యాచ్' పేరిట స్పోర్ట్స్ కేఫ్, రెస్టారెంట్ ఉంది. ఇందులో మంచి ఫుడ్‌తో పాటు ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణం ఉంటుంది.
- భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' పేరుతో రాజ్‌కోట్‌లో రెస్టారెంట్ కలిగి ఉన్నాడు. 24/7 వంద శాతం వెజిటేరియన్ ఫుడ్స్‌ను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.
- టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనాకు కూడా రెస్టారెంట్ బిజినెస్ ఉంది. నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో 'రైనా ఇండియన్ రెస్టారెంట్' పేరిట దీన్ని రన్ చేస్తున్నాడు. యూరోప్‌లో భారత వంటకాలను రుచి చూపిస్తోందీ రెస్టారెంట్.
- భారత జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కు పుణేలో 'జహీర్ ఖాన్స్ డైన్ ఫైన్' పేరుతో రెస్టారెంట్ ఉంది. భారతీయ, ఖండాంతర రుచులను ఇది అందిస్తోంది.