YS Viveka Murder Case: వైఎస్ వివేకా పీఏ పెట్టింది తప్పుడు కేసు: పులివెందుల పోలీసులు

- వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ లపై కేసు నమోదు
- ఇది తప్పుడు కేసు అని తేలిందన్న పులివెందుల పోలీసులు
- జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన పులివెందుల డీఎస్పీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసు అని పులివెందుల పోలీసులు నిర్ధారించారు. 2023 డిసెంబర్ 15న కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ లపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ ముగ్గురిపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని విచారణలో తేలిందని పులివెందుల పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఈ మేరకు జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్ షీట్ ను పులివెందుల డీఎస్పీ దాఖలు చేశారు. పులివెందుల మేజిస్ట్రేట్ సెలవులో ఉన్నందున ఛార్జ్ షీట్ ను జమ్మలమడుగు కోర్టులో సమర్పించారు. ఈ కేసులో 23 మంది సాక్షులను విచారించినట్టు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.