SSMB 29: 'ఎస్ఎస్ఎంబీ 29'పై ఒడిశా డిప్యూటీ సీఎం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Odisha Deputy CM Pravati Parida Tweet on SSMB 29

  • రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో 'ఎస్ఎస్ఎంబీ 29'
  • ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత జ‌క్క‌న్న తీస్తున్న‌ సినిమా 
  • మ‌హేశ్-రాజ‌మౌళి కాంబోలో తొలి చిత్రం కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు
  • ప్ర‌స్తుతం ఒడిశాలో శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సినిమా షూటింగ్ 
  • ఈ మూవీ షూటింగ్‌పై ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ట్వీట్‌

టాలీవుడ్‌ ద‌ర్శక‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ఒక మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ 29' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత జ‌క్క‌న్న తీస్తున్న‌ సినిమా కావ‌డం, అటు మ‌హేశ్-రాజ‌మౌళి కాంబోలో తొలి చిత్రం కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే, ఈ మూవీ షూటింగ్‌పై తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్‌లకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందని ఆమె ట్వీట్ చేశారు. 

"గతంలో మల్కాన్‌గిరిలో 'పుష్ప-2' షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే చిత్రం 'ఎస్ఎస్ఎంబీ 29' కోసం కోరాపుట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి అవ‌కాశం లాంటింది. 

ఈ చిత్ర షూటింగ్ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఒడిశా సినిమా షూటింగ్‌ల‌తో పాటు ప‌ర్యాట‌క‌రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల‌ ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగ్‌లకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాం" అంటూ ఒడిశా డిప్యూటీ సీఎం త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

More Telugu News