AP CS Vijayanand: ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారులను సత్కరించిన ఏపీ సీఎస్

AP CS congratulates Govt employee athletes

  • స్విమ్మింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకాలు సాధించిన డాక్టర్ సాయి శ్రీ 
  • యోగా పోటీల్లో మూడో స్థానం సాధించిన బి. రాముడు 
  • పతకాలు సాధించిన ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన సీఎస్

జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ నెల 5 నుంచి 7 వరకు గాంధీనగర్ (గుజరాత్)లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో పాడేరు మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాయి శ్రీ పాల్గొని 50 మరియు 100 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్లలో జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 

అలాగే, జూనియర్ అనలిస్ట్ బి. రాముడు (విజయవాడ) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగా పోటీల్లో మూడో స్థానం సాధించి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలను ఈ నెల 5 నుంచి 8 వరకు చండీగఢ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ స్పోర్ట్స్ సెక్రటరీ ఏ. వేరే శేఖర్, క్యాంటీన్ కోఆపరేటివ్ జనరల్ సెక్రటరీ ఆనందరావు, డాక్టర్ డి. యుగంధర్, కృష్ణమోహన్ , మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

  • Loading...

More Telugu News