Illicit Liquor: మద్యానికి బానిసైన మహిళలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!

Women addicted to alcohol Husbands who complained to the police

    


మద్యానికి బానిసైన తమ మహిళలు ఇంటిని గుల్ల చేస్తున్నారంటూ భర్తలందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని పురుషులందరూ నిన్న పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి ఈమేరకు మొరపెట్టుకున్నారు. 

గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు మాత్రం మద్యానికి బానిసై ఇల్లు గుల్ల చేస్తున్నారని, డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. ఇలాగైతే సంసారాలు గడవడం కష్టమని, పిల్లల బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News