Chhaava: బాహుబలి-2 రికార్డును క్రాస్ చేసిన 'ఛావా'

Chhaava crosses Bahubali2 collections inb 25 days

  • బాలీవుడ్ లో రూ.510 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2
  • ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా
  • 25 రోజుల్లో రూ.516 కోట్లు వసూలు

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'ఛావా' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ చారిత్రక చిత్రం విమర్శలకు ప్రశంసలను దక్కించుకుని, రికార్డుల మోత మోగిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు 'శంభాజీ మహరాజ్' పాత్రలో జీవించాడు. 

కాగా, 'ఛావా' చిత్రం తాజాగా బాహుబలి-2 రికార్డును దాటేసింది. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి-2 సినిమా బాలీవుడ్ లో రూ.510 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా కలెక్షన్లను 'ఛావా' అధిగమించింది. కేవలం 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 'ఛావా' 6వ స్థానంలో ఉంది. 'ఛావా' చిత్రం ఫిబ్రవరి 14న రిలీజైంది.

  • Loading...

More Telugu News