Lalit Modi: 'వనాటు అందమైన దేశం..' అంటూ లలిత్ మోదీ ట్వీట్

beautiful ocean in a beautiful country lalit modi posts from vanuatu as pm napat orders cancellation

  • వనాటు స్వర్గంలా ఉందంటూ లలిత్ మోదీ కామెంట్ 
  • లలిత్ మోదీ వనాటు పౌరసత్వం రద్దు చేయాలని ప్రకటించిన ప్రధాని జోథం నపాట్ 
  • 2010లో భారత్ నుంచి లండన్ పారిపోయిన లలిత్ మోదీ

ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో లండన్‌కు పారిపోయిన విషయం విదితమే. లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన వనాటు దేశ పౌరసత్వం పొందారు.

అయితే, స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకు లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి ప్రధాని జోథం నపాట్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

వనాటు ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే లలిత్ మోదీ ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. 'వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే' అని పేర్కొంటూ అక్కడ దిగిన ఫోటోను ఎక్స్‌లో లలిత్ మోదీ పంచుకున్నారు. లలిత్ మోదీ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

More Telugu News