Chiranjeevi: యంగ్ హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి గిఫ్ట్... ఫొటోలు ఇవిగో!

Megastar Chiranjeevi gifts Sreeleela a Durga Devi conch

  • నిన్న ఉమెన్స్ డే
  • సెట్స్ పై చిరంజీవిని కలిసిన శ్రీలీల
  • దుర్గా దేవి ప్రతిమను బహూకరించిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోయిన్ శ్రీలీలకు మహిళా దినోత్సవ కానుక ఇచ్చారు. విశ్వంభర సెట్స్ పై ఉన్న చిరంజీవిని కలిసేందుకు శ్రీలీల రాగా... ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఉమెన్స్ డే విషెస్ తెలిపారు. ఆమెకు చిరంజీవి దుర్గా దేవి అమ్మవారి ప్రతిమను బహూకరించారు. 

విశ్వంభర చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో శరవేగంగా సాగుతోంది. శ్రీలీల నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ కూడా అన్నపూర్త స్టూడియోస్ లో జరుగుతుండడంతో ఆమె మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలిసింది. 

చిరంజీవి నుంచి అందిన గిఫ్ట్ తో శ్రీలీల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఈ సందర్భంగా శ్రీలీల... చిరంజీవితో ఒక మెగా సెల్ఫీ తీసుకుని హ్యాపీగా ఫీలైంది. దీనికి సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి. 

  • Loading...

More Telugu News