Syria: సిరియాలో అల్లర్లు.. ప్రతీకార హత్యల్లో 1000 మందికిపైగా మృతి

Revenge Killings Leave Over 1000 Dead In Syria

  • సిరియాలో గురువారం ప్రారంభమైన అల్లర్లు
  • పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ బలగాలకు మధ్య భీకర పోరు
  • 745 మంది అమాయక పౌరులు బలైనట్టు చెప్పిన బ్రిటన్ మానవ హక్కుల సంస్థ

సిరియా భద్రతా దళాలు.. పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రతీకార హత్యల్లో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 14 ఏళ్ల క్రితం మొదలైన సిరియా ఘర్షణల్లో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి.

ఈ ఘర్షణల్లో 745 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రిటన్‌కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ పేర్కొంది. వీరిలో ఎక్కువమంది కాల్పుల్లో మరణించినట్టు తెలిపింది. 125 మంది ప్రభుత్వ భద్రతా బలగాల సభ్యులు, అసద్‌తో అనుబంధ సాయుధ గ్రూపులకు చెందిన 148 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాల్లో విద్యుత్తు, తాగునీరు నిలిచిపోయినట్టు వివరించింది.  

అసద్‌ను అధికారం నుంచి తొలగించిన మూడు నెలల తర్వాత గురువారం ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కొత్త ప్రభుత్వానికి ఇది సవాలుగా మారింది. అసద్ దళాలను తిప్పికొడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దారుణ హింసకు ‘వ్యక్తిగత చర్యలే’ కారణమని ఆరోపించింది.  

Syria
Revange Killings
Bashar Assad
Clashes

More Telugu News