Elon Musk: ట్రంప్ క్యాబినెట్ భేటీలో నేతల గొడవ.. మస్క్, రూబియోల మధ్య విభేదాలు

Rubio and Trump Officials Clash With Elon Musk in an Explosive Meeting

  • ఉద్యోగులను తొలగించడం లేదని రూబియోపై మస్క్ ఆరోపణ
  • ముందే పదవీ విరమణ చేసిన వారిని ఉద్యోగంలోకి తీసుకుని తొలగించాలా? అంటూ రూబియో ఎద్దేవా
  • మస్క్, రూబియోల మధ్య గొడవలేమీ లేవన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై డోజ్ సలహాదారు ఎలాన్ మస్క్ విమర్శలు చేశారని, దీంతో ట్రంప్ సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అయితే, అలాంటిదేమీ లేదంటూ ట్రంప్ ఈ వార్తలను కొట్టిపారేశారు. మస్క్, రూబియోల మధ్య గొడవలు లేవని, ఇద్దరూ చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ వివరించారు. 

అసలు ఏంజరిగిందంటే..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డోజ్ సలహాదారు మస్క్ లు ఇటీవల జరిగిన ట్రంప్ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేయని వారిని తాను ఇంటికి పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. మార్కో రూబియో మాత్రం ఎవరినీ తొలగించడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై రూబియో స్పందిస్తూ.. ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు ముందస్తుగా పదవీ విరమణ చేశారని తెలిపారు. ఇప్పుడు తాను తొలగించాలంటే వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని ఆపై తొలగించాలని మస్క్ ను ఎద్దేవా చేశారు. 

ఆ తర్వాత మస్క్, రూబియోల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మీడియా ప్రచురించిన వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, రూబియో- మస్క్ ల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఆ నేతలిద్దరూ తమ తమ శాఖలలో చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ కితాబునిచ్చారు.

  • Loading...

More Telugu News