Niranjana Anoop: ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!

- మలయాళంలో 'ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్'
- రెండు జంటల మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ స్టోరీ
- దర్శక నిర్మాతగా ప్రజేస్ సేన్
- త్వరలో సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
మలయాళ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోయింది. అందువలన ఓటీటీ ద్వారా వస్తున్న మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్' సినిమా పట్ల అందరూ కుతూహలంతో ఉన్నారు. అలాంటి ఈ సినిమా త్వరలో 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఈ సినిమాకి ప్రజేస్ సేన్ కథ .. స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, దర్శక నిర్మాతగాను వ్యవహరించాడు. నిరంజన అనూప్ .. అజూ వర్గీస్ .. శ్రీకాంత్ మురళి ప్రధానమైన పాత్రలను పోషించారు. జీనా - సెంథిల్, ఎల్డో - షీలా అనే రెండు జంటల మధ్య ఈ కథ నడుస్తుంది. వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనుబంధం ఏమిటి? అనేది కథ.
ఓటీటీ సినిమాల ద్వారా అజూ వర్గీస్ .. శ్రీకాంత్ మురళి .. నిరంజనా అనూప్ .. ఈ ముగ్గురూ కూడా ఇతర భాషా ప్రేక్షకులకు సుపరిచితులే. త్వరలోనే సన్ నెక్స్ట్ వారు స్ట్రీమింగ్ డేట్ సనౌన్స్ చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.