చైల్డ్ ఆర్టిస్టుగా చేయటానికి కారణం ఆర్ధిక ఇబ్బందులే: సీత
- మూడో ఏట నుంచే కెమెరా ముందుకు సీత
- వివిధ భాషల్లో 60 సినిమాలు చేసిన నటి
- తల్లి చనిపోవడం గురించిన ఆవేదన
" మూడేళ్ల వయసులోనే నేను కెమెరా ముందుకు వెళ్లాను. ఆర్ధిక పరమైన ఇబ్బందుల కారణంగానే నేను నటించవలసి వచ్చింది. అప్పట్లో నేను నటించడమనేది నా ఫ్యామిలీకి చాలా హెల్ప్ అయింది. తెలుగులో నా మొదటి సినిమా 'బంధాలు - అనుబంధాలు'. ఆ సినిమాలో శోభన్ బాబు - లక్ష్మి కూతురుగా నటించాను. ఆ తరువాత 'బలిదానం' సినిమాకి శోభన్ బాబుగారు సిఫార్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఒక 60 సినిమాల వరకూ నటించాను" అని అన్నారు.
" నా మొదటి పారితోషికం 500 రూపాయలు. డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే డబ్బులు వెనక్కి తీసుకుంటారని అమ్మ భయపెడితేనే గాని నేను సరిగ్గా చేయలేదట. 'బంధాలు - అనుబంధాలు'లో చిరంజీవిగారు ఒక కీలకమైన పాత్రను చేశారు. ఆ తరువాత ఆయనతో కలిసి 'సంఘర్షణ' చేశాను. 'హిట్లర్'లో చేసే ఛాన్స్ మాత్రం మిస్సయ్యింది. అనుక్షణం వెంట ఉంటూ వచ్చిన అమ్మ కేన్సర్ తో పోయింది. అప్పటి నుంచి నాకు దేవుడిపై భక్తి పోయింది" అని చెప్పారు సీత.