Revanth Reddy: హైదరాబాద్‌కు మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి

- ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
- ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుకను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి
- క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచన
హైదరాబాద్ నగరానికి మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గనుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు టీజీఎండీసీ నుండి ఇసుకను సరఫరా చేయాలని అన్నారు.
నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీయే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మైనర్ ఖనిజాల బ్లాకుల వేలానికి వెంటనే టెండర్లను పిలవాలని ఆయన సూచించారు.