Elon Musk: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఆయనే: ఎలాన్ మస్క్

- జేడీ వాన్స్ పై మస్క్ ప్రశంసలు
- ఉపాధ్యక్షుడి హోదాలో అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు
- వాన్స్ దేశాధ్యక్షుడు అవుతారని అంచనా వేసిన మస్క్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో అమెరికాకు ఆయన అధ్యక్షుడు అవుతారని అంచనా వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశ ఉపాధ్యక్షుడి హోదాలో వాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. మస్క్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు మస్క్ నేతృత్వంలో కొనసాగుతున్న డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇతర దేశాలకు ఇస్తున్న నిధులను కూడా కట్ చేస్తోంది. తద్వారా అమెరికా ఖర్చులను తగ్గిస్తూ, ఆదాయం పొదుపు చేస్తోంది.