Elon Musk: మరోసారి తండ్రి అయిన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు!

- నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన మస్క్ ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్
- ఇది మస్క్‌కు 14వ సంతానం
- తాజాగా పుట్టిన బిడ్డకు సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు వెల్లడి
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. ఇది మస్క్‌కు 14వ సంతానం. తాజాగా పుట్టిన బిడ్డకు సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా షివోన్ జిలిస్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. "ఎలాన్‌తో మాట్లాడాను. మా కుమారుడు సెల్డన్ లైకుర్గస్ గురించి ప్రపంచానికి స్వయంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నాం" అని ఆమె పేర్కొన్నారు. తమ మూడో సంతానం ఆర్కాడియా బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. కాగా, షివోన్ జిలిస్ పోస్టుకు మస్క్ హార్ట్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు.
కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్ తో ముగ్గురు, రచయిత్రి ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, షివోన్ జిలిస్‌తో మస్క్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇక ఇటీవల ఆష్లే సెయింట్ తన బిడ్డకు తండ్రి మస్కే అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు దీనిపై మస్క్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ బిడ్డకు కూడా ఆయన తండ్రి అని తేలితే... ఇప్పటివరకు మస్క్‌కు 14 మంది సంతానం ఉన్నట్లు అవుతుంది.