Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు బెదిరింపులు

Pakistani number sends threat to Maharashtra CM Devendra Fadnavis

  • పాకిస్థాన్ ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపులు
  • ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశం
  • ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ హెచ్చరిక

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశం వచ్చింది.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. వాట్సాప్ మెసేజ్ చేసిన వ్యక్తిని మాలిక్ షాబాజ్ హుమాయున్‌గా పేర్కొన్నారు. బెదిరింపు సందేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి, సీఎం క్యాంపు కార్యాలయం, వివిధ ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News