KTR: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి: కేటీఆర్ డిమాండ్

KTR demands for Judicial commission on SLBC

  • బాధ్యులైన వారిపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్
  • సహాయక చర్యలను వేగవంతం చేయాలన్న కేటీఆర్
  • మంత్రులు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు ఆగ్రహం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తూనే, ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరుసగా పలు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి దర్యాఫ్తు చేయలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసి దర్యాఫ్తు చేయాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సస్థల సహాయంతో సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావాలని పేర్కొన్నారు.

మంత్రులు రాజకీయాలు మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

ఎస్ఎల్‌బీసీలో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగి రావాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. సహాయక చర్యలకు వెళ్లిన మంత్రులు రాజకీయాలు మాట్లాడటం విడ్డూరమని అన్నారు. సహాయక చర్యలకు ఇబ్బందులు రాకూడదనే తాము ప్రమాదస్థలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఘటనలో వచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగితే ఎందుకు రావడం లేదని నిలదీశారు.

  • Loading...

More Telugu News