Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు

Land grabbing case filed on Vallabhaneni Vamsi

  • గన్నవరంలో రూ. 10 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారంటూ కేసు
  • వంశీపై ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది భార్య సీతామహాలక్ష్మి
  • ఇప్పటికే రెండు కేసులను ఎదుర్కొంటున్న వంశీ

ఇప్పటికే కిడ్నాప్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు తాజాగా భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. 

మరోవైపు వంశీ చేసిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే... వంశీకి నలువైపుల నుంచి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది.  

  • Loading...

More Telugu News