AP Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు... గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం హైలైట్స్

- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్
- పోలవరం, అమరావతిని పట్టాలెక్కించామని వెల్లడి
- విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడి
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ. 16 లక్షల కోట్లకు విస్తరించిందని వ్యాఖ్య
- బీసీల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్న గవర్నర్
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెఃజార్టీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టపోయామని అన్నారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం.
- మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగింది.
- ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం.
- పెన్షన్లను రూ. 4 వేలకు పెంచాం.
- విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
- అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం.
- 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం.
- పోలవరం, అమరావతిని పట్టాలెక్కించాం.
- ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ. 6.5 లక్షల పెట్టుబడులు పెట్టారు.
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ. 16 లక్షల కోట్లకు విస్తరించింది.
- పరిశ్రమలు, పరిపాలన, ఆర్థిక వృద్ధిలో ఏఐని వినియోగిస్తున్నాం.
- పీపుల్స్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం.
- కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.
- బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం.
- నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
- వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోయింది.
- ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.
- మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం.
- 2027 నాటికి పోలవరంను పూర్తి చేస్తాం.
- పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరవు ఉండదు.
- ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం.
- ఏపీని ఐటీలో టాప్ లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చాం.
- వైసీపీ నిలిపివేసిన 93 కేంద్ర పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించాం.
- ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
- వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరలోనే పూర్తిచేస్తాం.
- 10 పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం.
- 2029 నాటికి విశాఖలో 46 కిలోమీటర్లు, విజయవాడలో 38.40 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం జరుగుతుంది.
- 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశాం.