Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

AP CID files PT Warrant on Vallabhaneni Vamsi

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఇప్పటికే బెయిల్ నిరాకరించిన హైకోర్టు
  • వంశీపై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న సీఐడీ
  • కిడ్నాప్ కేసులో రేపటితో ముగుస్తున్న వంశీ రిమాండ్

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే పిటిషన్ పై విచారణ ముగిసింది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. 

మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో వంశీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో వంశీపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. 

  • Loading...

More Telugu News