YSRCP: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం

YSRCP protest in AP Assembly

  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్
  • పోడియంలోకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు
  • వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని నినాదాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News