Jagan: సాధారణ ఎమ్మెల్యేగా జగన్ గేట్-4 నుంచి నడుచుకుంటూ వెళతారా?

Jagan to enter Assembly from gate 4

  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • ప్రతిపక్ష నేత హోదా లేని జగన్
  • ప్రొటోకాల్ ప్రకారం గేట్ 4 నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేదనే విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే హాజరవుతున్నారు. 

అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవాళ్లందరూ ప్రొటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు రావాల్సి ఉంటుంది. గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ లోపలకు రావాల్సి ఉంటుంది. 

జగన్ సాధారణ ఎమ్మెల్యే కావడంతో ఆయన గేట్ నెంబర్ 4 నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు, స్పీకర్ తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి... గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేందుకు జగన్ కు అనుమతిని ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News