Gold Prices: పసిడి పరుగులు.. నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగిందంటే..!

- సామాన్యులకు షాకిస్తున్న బంగారం
- పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు
- 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి రూ. 80, 450కి చేరిన వైనం
- 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 మేర పెరుగుదల
పసిడి పరుగులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకు అంతకంతకూ పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా పెరిగిన ధరలతో బంగారం సామాన్యులకు షాకిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి రూ. 84,007కి చేరింది. అటు 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 87,770గా పలుకుతోంది. అయితే, పసిడి షాకిచ్చిన వేళ వెండి ధరలు కాస్త తగ్గి కిలో రూ. 1,07,000గా ఉంది.