Poonam Pandey: సెల్ఫీ దిగుతూ ముద్దు పెట్టే యత్నం.. అభిమాని తీరుతో నటి పూనం పాండే షాక్.. వీడియో ఇదిగో!

Poonam Pandey SHOCKED As Fan Tries To Forcibly Kiss Her

  • ఫొటో సెషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా ఘటన
  • వెంటనే అతడ్ని బలంగా నెట్టేసిన నటి
  • అంతా ‘స్క్రిప్టెడ్’ అంటున్న నెటిజన్లు

వివాదాస్పద బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాండేకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫొటో సెషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన నటి అతడికి సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా, బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నటి సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న పూనం అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. 

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని, ‘స్క్రిప్టెడ్’ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరంటే, ఆమె అంత బాగా నటించలేదని మరొకరు రాసుకొచ్చారు. 

కాగా, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా గతేడాది తాను చనిపోయినట్టు పూనం అందరినీ నమ్మించింది. అయితే, ఆ తర్వాత తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే అలా నటించానని వివరణ ఇచ్చుకుంది. కాగా, వివాదాస్పద కామెంట్లు, సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో పూనం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే, సినీ నిర్మాత శామ్ బాంబేతో వివాహం, విడాకుల విషయంలోనూ ఆమె వార్తల్లోకి ఎక్కింది. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

  • Loading...

More Telugu News