Kumbha Mela: కుంభమేళాలో 55 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన

Holy dip taken by 55 crore devotees at Sangam so far

  • కుంభమేళాకు తరలి వస్తున్న భక్తులు
  • మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
  • 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పుణ్యస్నానమాచరించారన్న ప్రభుత్వం

మంగళవారం సాయంత్రం నాటికి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 55 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు, ప్రముఖులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు తెలిపింది.

దేశంలోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానమాచరించారని తెలిపింది. ఈ రోజు సాయంత్రానికి 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారని, ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశముందని అంచనా వేశారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మార్కును అధిగమించి ఈరోజు 55 కోట్లకు చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు.

  • Loading...

More Telugu News