Jagan: కేసీఆర్ కు దేవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: జగన్

Jagan greetings ot KCR

  • నేడు కేసీఆర్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలుపుతున్న రాజకీయ ప్రముఖులు
  • కేసీఆర్ కు భగవంతుడు పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించిన జగన్

నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు. ఈరోజు ఆయన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నాయకులు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

"మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. కేసీఆర్ ను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

Jagan
YSRCP
KCR
BRS

More Telugu News