Ileana: మరోసారి తల్లి కాబోతున్న ఇలియానా

- ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా
- 2023లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లీ
- తాను మరోసారి గర్భం దాల్చినట్టు ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఇలియానా
కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన గోవా బ్యూటీ ఇలియానా... ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. 2023లో ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. తాజాగా ఇలియానా మళ్లీ తల్లి కాబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇలియానా స్పందిస్తూ.. తాను మరోసారి తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ను ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తద్వారా తాను మరోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది.
'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాప్ హీరోల సరసన నటిస్తూ... తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఇలియానానే.