Ponzi Scheme: పోంజీ స్కామ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

Cyberabad police arrest two in Ponzi scheme

  • పెట్టుబడుల పేరిట 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు 
  • ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ కుంభకోణం
  • గత నెల 15న బోర్డు తిప్పేసిన సంస్థ

పోంజీ స్కామ్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. 

వీరు పెట్టుబడుల పేరిట 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. భారీ ఎత్తున వసూలు చేసినప్పటికీ, తిరిగి డిపాజిటర్లకు రూ.850 కోట్లు మాత్రమే చెల్లించారు. వసూలు చేసిన డబ్బును 14 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. 

ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంపెనీ జనవరి 15న బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు లబోదిబోమన్నారు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చారు.

  • Loading...

More Telugu News