Murder: మేడ్చల్ లో దారుణం... నడిరోడ్డుపై యువకుడి హత్య

Youth killed in day light in Medchal

  • అందరూ చూస్తుండగా యువకుడిని కత్తులతో పొడిచి చంపిన వైనం
  • సొంత తమ్ముడే హత్యకు పాల్పడినట్టు గుర్తింపు
  • కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్ శివారు మేడ్చల్ లో ఇవాళ పట్టపగలే దారుణం జరిగింది. దుండగులు నడిరోడ్డుపై ఓ యువకుడిని హత్య చేశారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి అంతమొందించారు. హత్య అనంతరం ఇద్దరు దుండగులు అక్కడ్నించి పరారయ్యారు.

హత్యకు గురైన యువకుడిని ఉమేశ్ (25) గా గుర్తించారు. కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మద్యానికి బానిసైన సొంత తమ్ముడే హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఉమేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

కాగా, ఘటన స్థలిలో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హత్య వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

  • Loading...

More Telugu News