Anchor Syamala: పేరుపేరునా కృతజ్ఞతలు... ట్రోలర్స్ కు ఈ విధంగా బదులిచ్చిన శ్యామల

Anchor Syamala counters trollers

  • ఇటీవల శ్యామల పై భారీగా ట్రోలింగ్ 
  • చిన్న నాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారన్న శ్యామల
  • హృదయానికి చేరువగా ఉండే ఫొటోలను నా వరకు తీసుకొచ్చారంటూ ట్వీట్

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. శ్యామల సినీ, టీవీ రంగాల్లోకి రాకముందే కొన్ని వేదికలపై చేసిన డ్యాన్సుల వీడియోలు, ఫొటోలను పంచుకుంటూ ట్రోలర్స్ విజృంభించారు. రికార్డింగ్ డ్యాన్సులు, టైరు బళ్లపై డ్యాన్సులు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై శ్యామల ఆసక్తికరంగా స్పందించారు. 

"మీరు నాపై చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకుని జీవితపోరాటంలో ముందుకు సాగాను. అలాంటి నా చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేందుకు మీరు పడిన శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. 

నా బాల్య స్మృతులను వెతికి... నా హృదయానికి చేరువగా ఉండే ఫొటోలను నా వరకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమ, ఆదరణ, నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ శ్యామల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్రోలర్స్ ప్రచారం చేస్తున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.

  • Loading...

More Telugu News