Chandrababu: మూడేళ్ల తర్వాత అద్దంలా మారిన గుంటూరు రోడ్డు

Guntur Road Repair Works Completed

  • అప్పుడు గుంతలమయం.. ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న వైనం
  • ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి పనులు పూర్తి
  • రూ. 3 కోట్లతో రోడ్డు నిర్మించిన కూటమి సర్కారు

వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా మారిన గుంటూరు రోడ్డును కూటమి సర్కారు అద్దంలా తీర్చిదిద్దింది. మూడేళ్లుగా ఏటీ అగ్రహారం పరిసర వాసులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టింది. రూ. 3 కోట్లతో రోడ్డుకు మరమ్మతులు చేయించింది. మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చింది. అప్పట్లో ఈ రోడ్డుపై ఉన్న గుంతల్లో పడుతూలేస్తూ వెళ్లిన జనం ఇప్పుడు సాఫీగా సాగిపోతున్నారు. కూటమి సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. గుంటూరు నగరంలో ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి ప్రస్తుతం అద్దంలా మారింది. హైదరాబాద్, ఒంగోలు జాతీయ రహదారి నుంచి గుంటూరులోని పలు కాలనీలకు వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం. 

మరమ్మతులు, విస్తరణ పనులను అప్పట్లో ఓ కాంట్రక్టరుకు అప్పగించింది. అయితే, నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపేశారు. మరమ్మతు పనుల కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. దీంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. సుమారు 1.6 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు మీద గుంతల కారణంగా చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనం ఆందోళనలు చేశారు. అయినప్పటికీ జగన్ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అగ్రహారం రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. రూ.3 కోట్లతో రోడ్డును అద్దంలా మార్చేసింది. మధ్యలో డివైడర్‌నూ నిర్మించి నగరవాసుల కష్టాలకు ముగింపు పలికింది.

  • Loading...

More Telugu News