Krishnaveni: నటి కృష్ణవేణి మృతి బాధాకరం: చంద్రబాబు

--
ప్రముఖ నిర్మాత, నటి కృష్ణవేణి మరణం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. స్టూడియో అధినేతగా, పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారని చెప్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారని గుర్తుచేశారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.