sexual harassment: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపుల కలకలం

sexual harassment in guntur ggh

  • ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేస్తున్న విద్యార్థినులపై గుంటూరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి లైంగిక వేధింపులు
  • ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థినులు
  • ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని వేసిన ప్రిన్సిపాల్

గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాల (జీజీహెచ్)లో ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేస్తున్న కొందరు విద్యార్థినులు శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో పనిచేసే ఓ ఉద్యోగి వారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేశాడని బాధిత విద్యార్థినులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారికి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా సదరు బ్లడ్ బ్యాంక్ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 

  • Loading...

More Telugu News