Rekhachithram: మార్చి 7 నుంచి సోనీ లివ్ లో 'రేఖాచిత్రం' స్ట్రీమింగ్

మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కథలకు ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది. ఈ కోవలో వచ్చిన చిత్రమే 'రేఖాచిత్రం'. రూ.9 కోట్ల స్వల్ప బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.55 కోట్లు వసూలు చేయడం విశేషం. మాంచి మర్డర్ మిస్టరీ క్రైమ్ కథతో తెరకెక్కింది 'రేఖాచిత్రం' మూవీ త్వరలోనే ఓటీటీ వేదికపైకి రానుంది. మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ 'రేఖాచిత్రం' మూవీకి జోఫిన్ టి చాకో దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
