BJP: కేజ్రీవాల్‌కు ఝలక్... బీజేపీలో చేరిన ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు

Three AAP councillors join BJP boost its chances in mayoral poll

  • శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు
  • బీజేపీలో చేరిన కౌన్సిలర్లు అనిత బసోయా, నిఖిల్ చాప్రాన, ధర్మవీర్
  • ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని ధీమా

ఢిల్లీ మేయర్ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ముగ్గురు కౌన్సిలర్లు షాకిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వారికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏప్రిల్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆండ్రూస్ గంజ్ కౌన్సిలర్ అనిత బసోయా, హరినగర్ కౌన్సిలర్ నిఖిల్ చాప్రాన, ఆర్కేపురం కౌన్సిలర్ ధర్మవీర్ బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని ఆయన అన్నారు. కేంద్రం, అసెంబ్లీ తర్వాత మున్సిపల్ స్థాయిల్లో మేయర్ స్థానాన్ని గెలుచుకొని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఢిల్లీ అభివృద్ధికి ఇదే సరైన తరుణమని అన్నారు. ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్ అండ్ బ్యూటీఫుల్ సిటీగా మార్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారని అన్నారు.

  • Loading...

More Telugu News