Buchibabu Sana: ఆర్సీ16 దర్శకుడు బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన టీమ్... ఫొటోలు ఇవిగో!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో, చిత్రబృందం ఆయన బర్త్ డే వేడుకలు నిర్వహించింది. నిర్మాత వెంకట సతీష్ కిలారు, ఇతర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్రబృందం సభ్యులు బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రం ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఆర్సీ16కి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. కాగా, ఈ సినిమా కోసం పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.


