Love Jihad: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra to make law to control love jihad

  • ఇప్పటికే లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్న పలు రాష్ట్రాలు
  • ఒక ప్రత్యేక కమిటీని వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
  • ప్రత్యేక చట్టాన్ని రూపొందించనున్న కమిటీ

మన దేశంలో పలు చోట్ల లవ్ జిహాద్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా లవ్ జిహాద్ పై ఉక్కుపాదం మోపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడినన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు, సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థ, హోం వంటి కీలక శాఖలను చెందిన అధికారులు ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఉన్న చట్టాలను, ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసి లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడిపై ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తుంది. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. 

ఇప్పటికే పలు రాష్ట్రాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చాయి. గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి.

Love Jihad
Maharashtra
  • Loading...

More Telugu News