Liquor: ఏ రాష్ట్రంలో మహిళలు మద్యం ఎక్కువగా తాగుతారో తెలుసా?

- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో ఆసక్తికర విషయాలు
- మహిళలు మద్యం అత్యధికంగా సేవించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో అసోం
- రెండో స్థానంలో మేఘాలయ, మూడో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్
మన దేశంలోని ఏ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా తాగే మహిళలు ఉన్నారో మీకు తెలుసా? కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహిళలు మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అసోం ముందుంది. సర్వే ప్రకారం ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి.
అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉంది. అసోంలో ఇది 16.5 శాతం, మేఘాలయలో 8.7 శాతంగా ఉందని సర్వేలో వెల్లడైంది.